భారతదేశం, జూలై 26 -- Telangana Soak Pits : రాష్ట్రంలో భూగర్భ జలాల పెంపకంతో పాటు గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. వచ్చే ఆగస్టు 15వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇంకుడు గుంతల నిర్మాణాన్ని పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.

శనివారం సచివాలయం నుంచి స్పెషల్ సీఎస్ దానకిషోర్, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్, స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మితో కలిసి మంత్రి సీతక్క ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), డిఆర్డిఓలు, జిల్లా పంచాయతీ అధికారులు, జెడ్పీ సీఈవోలు, ఎంపీడీవోలు మరియు పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వీబీ జీ రాంజీ (VB G RAM G), తెలంగా...