భారతదేశం, జూన్ 23 -- రాష్ట్రంలోని అన్నదాతలకు సాగు ముంగిట తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వాతావరణ మార్పులు, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున విత్తన మేళాల నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది.

నేటి నుంచి నుండి జూన్ 30వ తేదీ వరకు రాష్ట్రంలోని మొత్తం 2,601 రైతు వేదికల్లో ఈ విత్తన మేళాలను వైభవంగా నిర్వహించనున్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను తట్టుకుని, తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలను ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ ఈ ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది.

ఈ విత్తన మేళాల ద్వారా నాణ్యమైన, ధ్రువీకరించిన వివిధ రకాల పంటల విత్తనాలను ఒకే వేదికపై రైతులకు నేరుగా అందుబాటులో ఉంచుతారు. దళారీల బెడద లేకుండా, నకిలీ విత్తనాల బారిన పడకుండా రైతులు తమకు కావలసిన విత్తనాలను సరస...