భారతదేశం, నవంబర్ 6 -- Teja Sajja Revanth Reddy: సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, నేడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యువ కథానాయకుడు తేజ సజ్జా త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన వివాహానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండగా, తాజాగా ఆ వార్త నిజమేనని స్పష్టమైంది.

తన నిశ్చితార్థ వేడుకకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తేజ సజ్జా మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తేజ సజ్జా, ఆయనకు బొకే అందించి మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తన నిశ్చితార్థ వేడుక ఆహ్వాన పత్రికను అందజేసి, వేడుకకు తప్పక హాజరుకావాలని కోరారు.

యంగ్ హీరోను ఎంతో ఆప్యాయంగా పలకరించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆయన నిశ్చితా...