భారతదేశం, నవంబర్ 16 -- Teja Sajja Engagement Chiranjeevi To Nani Attends: బాలనటుడిగా వెండితెరపై అడుగుపెట్టి 'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన యంగ్ హీరో తేజ సజ్జా ఓ ఇంటివాడు కాబోతున్నారు. అమెరికాలో స్థిరపడిన యువతితో తేజా సజ్జా నిశ్చితార్థ వేడుక సోమవారం (నవంబర్ 16) హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో అత్యంత వైభవంగా జరిగింది.

ఇరు కుటుంబాల పెద్దలు, సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ జంట ఉంగరాలు మార్చుకున్నారు. ఈ నిశ్చితార్థపు వేడుకలో తేజ సజ్జా లేత గులాబీ రంగు కుర్తా, పూల డిజైన్ ఉన్న వెయిస్ట్‌కోట్ ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాబోయే వధువు బంగారు వర్ణం పూసలతో అలంకరించిన లంగాఓణీలో సంప్రదాయబద్ధంగా మెరిసిపోయారు.

పూల పందిరి కింద నిల్చున్న ఈ జంటకు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా స్వయంగా హాజరై శుభాకాంక్షలు తెలిపా...