భారతదేశం, అక్టోబర్ 26 -- Teja Sajja: టాలీవుడ్‌లో కొత్త తరహా ఇతిహాసాలు, వినూత్న జానర్లకు ఆద్యుడిగా పేరు తెచ్చుకున్న యంగ్ హీరో తేజ సజ్జా. 2021లో వచ్చిన 'జాంబి రెడ్డి' మూవీతో తెలుగు ప్రేక్షకులకు తొలిసారి 'జాంబి కాన్సెప్ట్'ను పరిచయం చేసిన ఆయన.. ఆ తర్వాత 'హనుమాన్' (HanuMan) చిత్రంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లతో ప్రపంచస్థాయి విజయాన్ని అందుకున్నారు.

ఇప్పుడు తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న సీక్వెల్ 'జాంబి రెడ్డి 2 - NXT LVL' గురించి ఇంటర్నేషనల్ మీడియా సంస్థ 'వెరైటీ ఇండియా'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బాలీవుడ్ స్టార్ షనాయా కపూర్ (Shanaya Kapoor) ఈ చిత్రంతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుండగా, ప్రముఖ దర్శకుడు సుపర్ణ్ ఎస్. వర్మ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా మ...