భారతదేశం, నవంబర్ 7 -- Satvik Varma Tholi Prema Katha Teaser Released: తెలుగులో వస్తున్న సరికొత్త సినిమా తొలి ప్రేమ కథ. ఈ సినిమాలో సాత్విక్ వర్మ, అనీ హీరో, హీరోయిన్‌గా నటిస్తున్నారు. లిఖిత్, ఆదిత్య సమర్పణలో లతా కె నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి లక్ష్మణ్ అల్లు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా తొలి ప్రేమ కథ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. హీరో ఆకాష్ పూరి, డైరెక్టర్ శైలేష్ కొలను ఈ ట్రైలర్ లాంచ్‌లో అతిథులుగా హాజరయ్యారు.

తొలి ప్రేమ కథ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. "'తొలి ప్రేమ కథ' కరెక్ట్ టైమ్‌లో మూడ్ ఆఫ్ ది సీజన్ అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమాల కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. అలాంటి సమయంలోనే ఈ సినిమా వస్తోంది. టీజర్ చూస్తుంటే చాలా హాయిగా ఉంది. చాలా జెన్యూన్‌గా, నేచురల్‌గా ఉంది" అని అన్నారు.

"సాత్విక్ చైల్డ్ ఆర్టిస్...