భారతదేశం, అక్టోబర్ 9 -- శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఐటీ ఇండెక్స్ దూసుకెళుతోంది. మరీ ముఖ్యంగా దిగ్గజ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) షేర్లు 5శాతం లాభాల్లో ఉన్నాయి. ఉదయం 10:30 నిమిషాలకు టీసీఎస్​ షేర్లు 5.63శాతం పెరిగి రూ. 2192.80 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. 2,202.90 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకాయి. త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఆకట్టుకోవడంతో పాటు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విభాగం నుంచి బలమైన ఆదాయం లభించడం ఈ ర్యాలీకి కారణం.

భారత ఐటీ రంగానికి ఊపిరిపోస్తున్న దిగ్గజ సంస్థ టీసీఎస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) రెండో త్రైమాసికంలో (క్యూ2 ఎఫ్​వై27) అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఏడాది ప్రాతిపదికన ఏకంగా 15 శాతం వృద్ధితో రూ. 13,884 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఈ లాభం రూ. 12,075 కోట్ల...