భారతదేశం, అక్టోబర్ 8 -- దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆకట్టుకునే ఆర్థిక ఫలితాలను సాధించింది. సెప్టెంబరుతో ముగిసిన క్వార్టర్ 2లో కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 15 శాతం పెరిగి రూ.13,884 కోట్లకు చేరింది. బ్యాంకింగ్ విభాగంలో నమోదైన వృద్ధితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత సేవల డిమాండ్ పెరగడం టీసీఎస్ ఆదాయానికి ప్రధాన ఊతమిచ్చింది.

గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.65,799 కోట్లతో పోలిస్తే, ఈసారి టీసీఎస్ సమీకృత ఆదాయం 11.22 శాతం పెరిగి రూ.73,188 కోట్లకు (7.57 బిలియన్ డాలర్లు) ఎగబాకింది. మార్కెట్ విశ్లేషకులు అంచనా వేసిన రూ.73,148 కోట్ల ఆదాయం కంటే ఇది మెరుగైన ప్రదర్శన. అక్టోబరు 8న జరిగిన బోర్డు సమావేశం అనంతరం కంపెనీ ఈ వివరాలను బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (...