భారతదేశం, మే 18 -- టాటా మోటార్స్ తమ మోడ్రన్ ప్యాసింజర్ వెహికల్ లైనప్‌లో మైలురాయిగా నిలిచిన 'టాటా టియాగో'ని సరికొత్త హంగులతో మార్కెట్​లోకి విడుదల చేయడానికి సిద్ధం చేస్తోంది. ఇప్పటికే మార్కెట్​లో మంచి సక్సెస్ సాధించిన ఈ కారుకు ఈ ఏడాది చివరిలో మరో ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తాజాగా దేశీయ రోడ్లపై ఈ కొత్త టియాగో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ముమ్మరంగా టెస్టింగ్ జరుపుకుంటూ కెమెరా కంటికి చిక్కింది. లీకైన స్పై ఇమేజెస్ ప్రకారం.. కారు పాత సిల్హౌట్ అలాగే ఉన్నప్పటికీ, ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్‌లో భారీ కాస్మెటిక్ మార్పులు జరగనున్నట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ టాటా టియాగో ఫేస్​లిఫ్ట్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

కొత్త టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ ముందు భాగం టాటా లేటెస్ట్ డిజైన్ లాంగ్వేజ్‌కు అనుగుణంగా మరింత షార్ప్‌గా, మస్కుల...