భారతదేశం, మే 18 -- టాటా గ్రూప్‌నకు చెందిన ప్రముఖ ఉక్కు తయారీ సంస్థ 'టాటా స్టీల్' సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో భారీగా పతనమైంది. శుక్రవారం రూ.216.84 వద్ద ముగిసిన ఈ స్టాక్, నేడు రూ.211 వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం 10 గంటల ప్రాంతంలో టాటా స్టీల్​ షేరు ధర 4.6శాతం నష్టాలతో రూ. 206.72 వద్ద ట్రేడ్​ అవుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ మంచి లాభాలను అర్జించినప్పటికీ షేరు ధర ఈ స్థాయిలో పతనం అవుతుండటం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేస్తోంది. అయితే కంపెనీ సాధించిన లాభాలు మార్కెట్ నిపుణులు అంచనా వేసిన దానికంటే స్వల్పంగా తక్కువగా ఉండటమే ఈ ప్రాఫిట్ బుకింగ్‌కు ప్రధాన కారణమని తెలుస్తోంది.

నికర లాభం : గత ఆర్థిక సంవత్సరం క్యూ4 లో రూ.1,201 కోట్లుగా ఉన్న కన్సాలిడేటెడ్ నికర లాభం.. ఈ ఏడాది మార్చి త్రైమాసికానికి ఏకంగా 147 శాతం వృద్ధితో రూ...