భారతదేశం, నవంబర్ 23 -- భారత ఉక్కు పరిశ్రమలో మరో చారిత్రక ఒప్పందానికి రంగం సిద్ధమైంది! దిగ్గజ సంస్థ టాటా స్టీల్ తన డౌన్‌స్ట్రీమ్ ఉక్కు వ్యాపారాన్ని భారీగా విస్తరించే దిశగా కీలక అడుగు వేసింది. స్టీల్ ట్యూబ్స్, పైపుల తయారీలో అగ్రగామిగా ఉన్న 'ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ లిమిటెడ్'లో 26.6 శాతం వాటాను రూ. 15,510 కోట్లకు కొనుగోలు చేసేందుకు సోమవారం ఆమోదం తెలిపింది. అధిక లాభాలను తెచ్చిపెట్టే విలువ ఆధారిత ఉక్కు ఉత్పత్తుల విభాగంలో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవాలనే లక్ష్యంతో టాటా స్టీల్ ఈ భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

స్టాక్ ఎక్స్​ఛేంజీలకు సమర్పించిన వివరాల ప్రకారం.. ఏపీఎల్ అపోలో ప్రమోటర్ గ్రూప్ సంస్థ అయిన 'ఎస్ గుప్తా హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్' నుంచి ఒక్కో షేరును రూ. 2,100 చొప్పున మొత్తం 7.38 కోట్ల (73.8 మిలియన్ల) షేర్లను టాటా స్టీల్ కొనుగోలు చేస్తు...