భారతదేశం, ఏప్రిల్ 17 -- Tata Sierra vs Kia Seltos base variants : మధ్యతరహా ఎస్‌యూవీ విభాగంలో టాటా సియెర్రా, కియా సెల్టోస్ మధ్య ఆసక్తికరమైన పోరు సాగుతోంది. ముఖ్యంగా ఈ రెండు కార్ల బేస్ వేరియంట్లు వేర్వేరు వ్యూహాలతో మార్కెట్లోకి వచ్చాయి. టాటా సియెర్రా 'స్మార్ట్+' వేరియంట్ భద్రతకు పెద్దపీట వేయగా, కియా సెల్టోస్ 'హెచ్​టీఈ' వేరియంట్ టెక్నాలజీ, లార్జ్ స్క్రీన్ ఫీచర్లపై దృష్టి సారించింది. మరి ఈ రెండింటిలో ఏది కొనాలి? ఏది బెస్ట్​? ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

సేఫ్టీ విషయంలో టాటా ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. సియెర్రా స్మార్ట్+ వేరియంట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 20 రకాల ఫంక్షన్లతో కూడిన ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్​పీ), ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. అదనంగా హిల్ అసెండ్ కంట్రోల...