భారతదేశం, ఫిబ్రవరి 27 -- భారతీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్​లో బడ్జెట్ ధరలో కార్లను కోరుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని టాటా మోటార్స్ తన పాపులర్ మైక్రో ఎస్‌యూవీ 'పంచ్'ని సరికొత్త అప్‌డేట్‌లతో 2026 వెర్షన్‌గా మార్కెట్​లోకి తీసుకొచ్చింది. కేవలం డిజైన్ మాత్రమే కాకుండా, కొనుగోలు విధానంలోనూ సరికొత్త మార్పులు చేస్తూ 'బ్యాటరీ-యాస్-ఏ-సర్వీస్' (బీఏఏఎస్​) స్కీమ్​ని సైతం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ నేపథ్యంలో మార్కెట్​లో దీనికి ప్రధాన పోటీదారుగా ఉన్న ఎంజీ కామెట్ ఈవీతో పోలిస్తే ఏది వాల్యూ ఫర్​ మనీ బై అవుతుంది? అనేది ఇక్కడ తెలుసుకోండి..

బ్యాటరీ ధరను మినహాయించి కారును మాత్రమే కొనుగోలు చేసే ఈ విధానంలో ధరలు చాలా తక్కువగా ఉంటాయి:

టాటా పంచ్ ఈవీ: బీఏఏఎస్​ ప్రోగ్రామ్ కింద దీని ప్రారంభ ధర రూ. 6.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీని ...