భారతదేశం, ఆగస్టు 7 -- దేశీయ ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్.. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో తమ ప్రాచుర్యాన్ని మరింత పెంచుకునేందుకు సరికొత్త అడుగు వేసింది. మార్కెట్లో అత్యధికంగా అమ్ముడయ్యే 'నెక్సాన్' ఎస్​యూవీలో ప్రత్యేకమైన 'కామో ఎడిషన్'ని భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 9.99 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ కామో ఎడిషన్‌ను కేవలం ఒక్క ఇంజిన్‌కే పరిమితం చేయకుండా పెట్రోల్, డీజిల్, ఐ-సీఎన్జీ విభాగాల్లోని పలు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకురావడం విశేషం.

సాధారణ నెక్సాన్ మోడల్‌తో పోలిస్తే ఈ కామో ఎడిషన్ బాహ్య, అంతర్గత రూపంలో పలు ఆకర్షణీయమైన మార్పులను పొందింది.

ప్రత్యేక రంగులు: ఈ మోడల్‌ను రెండు సరికొత్త ఎక్స్‌క్లూజివ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి తెచ్చారు. అందులో ఒకటి 'మున్నార్ మిస్ట్' కాగా మరొకటి 'కూర...