భారతదేశం, మే 13 -- Tata Nexon on road price : భారత ఆటోమొబైల్ మార్కెట్​లో టాటా నెక్సాన్ ఒక సంచలనం. తనదైన భద్రతా ప్రమాణాలు, స్టైలిష్ లుక్స్‌తో ఎస్‌యూవీ విభాగంలో రారాజుగా వెలుగుతోంది. ప్రస్తుతం ఈ కారు టర్బో-పెట్రోల్, డీజిల్, సీఎన్జి అనే మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తోంది. మొత్తం 44 స్టాండర్డ్ వేరియంట్లు, వీటికి అదనంగా డార్క్, రెడ్ డార్క్ ఎడిషన్లతో కస్టమర్లకు భారీ ఆప్షన్లను టాటా మోటార్స్ అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ 2026లో టటా నెక్సాన్ కొనాలనుకుంటే ఏ వేరియంట్​ని ఎంచుకోవాలి? అసలు ఏ వేరియంట్​లో ఏ ఫీచర్లు ఉన్నాయి? ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

నెక్సాన్ ఎస్​యూవీ మూడు రకాల ఇంజిన్లతో మార్కెట్​లో అందుబాటులో ఉంది:

1.2 లీటర్ టర్బో-పెట్రోల్: ఇది 120hp శక్తిని ఇస్తుంది. దీనిలో 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఏఎంటీ, 7-స్పీడ్ డ్యూయల్ క్ల...