భారతదేశం, ఆగస్టు 25 -- భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న బెస్ట్​ సెల్లింగ్ టాటా నెక్సాన్ ఎస్​యూవీ త్వరలో ఓ సరికొత్త రూపంలో మన ముందుకు రానుంది. సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో నెక్సాన్ ముందువరుసలో ఉన్న విషయం తెలిసిందే. గత తొమ్మిదేళ్ల ప్రయాణంలో ఈ కారుకు ఎన్నో అప్‌డేట్లు వచ్చాయి. అయితే, ఇప్పుడు మాత్రం కంపెనీ నెక్సాన్‌కు పూర్తిస్థాయి జనరేషనల్ అప్‌డేట్ తెచ్చే పనిలో పడింది. ఇటీవలే రోడ్లపై టెస్టింగ్ జరుపుతున్న ఒక కొత్త నెక్సాన్ మోడల్ కెమెరాకు చిక్కింది. తద్వారా ఆటోమొబైల్ రంగంలో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.

ఈ నేపథ్యంలో నూతన తరం నెక్సాన్‌లో రాబోయే మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

రోడ్లపై టెస్టింగ్ జరుపుతున్న ఈ ఎస్​యూవీ పూర్తిగా కవర్ చేసి ఉంది. అయినప్పటికీ దాని బాడీ షేప్, ఓఆర్‌వీఎం డిజైన్ చూస్తే...