భారతదేశం, మే 17 -- Tara Sutaria Toxic: కన్నడ స్టార్ హీరో, గ్లోబల్ ఐకాన్ యష్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్'. ఈ చిత్రం విడుదల కోసం సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా అనుకున్న సమయానికి రాకుండా వరుసగా వాయిదా పడుతుండటం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. దీనిపై తాజాగా హీరోయిన్ తారా సుతారియా చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

మొదటగా మార్చి 19న విడుదల కావాల్సిన టాక్సిక్ చిత్రం.. మధ్యప్రాచ్యంలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా జూన్ 4వ తేదీకి మారింది. ఆ తర్వాత ఏప్రిల్ నెలలో హీరో యష్ స్వయంగా ఈ సినిమా మరింత ఆలస్యం కానుందని స్పష్టం చేశాడు. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినప్పటికీ, అంతర్జాతీయ స్థాయిలో భారీ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్, వ్యూహాత్మక భాగస్వామ్యాలను కుదుర్చుకోవడంపైనే ప్రస్తుతం చిత్...