భారతదేశం, సెప్టెంబర్ 29 -- Tanya Mishra: గతంలో రష్మిక మందన్నా, త్రిప్తి దిమ్రి వంటి హీరోయిన్లను అభిమానులు "నేషనల్ క్రష్"గా పిలిచారు. ప్రస్తుతం అలాగే సోషల్ మీడియాలో తాన్యా మిశ్రా (Tanya Mishra) పేరు మార్మోగిపోతోంది. ఈ బ్యూటీని నేషనల్ క్రష్ అంటూ నెటిజన్లు పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ఈ క్రేజ్‌తో తాన్యా మిశ్రా ఎవరు? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అనే అంశాలను నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు.

తాన్యా మిశ్రా 1999 జనవరి 31న బీహార్‌లోని గయాలో జన్మించింది. మగధ్ యూనివర్సిటీ నుంచి బి.కామ్ డిగ్రీ పూర్తి చేసిన అనంతరం, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో స్థిరపడేందుకు ముంబైకి మకాం మార్చింది. 2019లో జరిగిన IAWA మిస్ ఇండియా పోటీల్లో ఫోర్త్ రన్నరప్‌గా నిలిచి తొలిసారి వెలుగులోకి వచ్చింది.

ఆ తర్వాత తాన్యా శర్మ మోడలింగ్ రంగంలో రాణిస్తూ ఫెమినా (Femina), ఫిలింఫేర్ (Filmfar...