భారతదేశం, మే 9 -- Tanishaa Mukerji About Aditya Chopra: గ్లామర్ ప్రపంచంలో వెలిగిపోవాలంటే నటీనటులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఫిజిక్ విషయంలో నిర్మాతలు, దర్శకులు పెట్టే కండిషన్లు ఒక్కోసారి వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. తాజాగా ఇదే విషయాన్ని బాలీవుడ్ హీరోయిన్ తనీషా ముఖర్జీ బయటపెట్టారు.

2005లో వచ్చిన 'నీల్ ఎన్ నిక్కీ' సినిమా షూటింగ్ సమయంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను తనీషా ముఖర్జీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వివరించారు. హిందీ సినీ దిగ్గజం ఆదిత్య చోప్రా తనను స్క్రీన్ టెస్ట్‌కు పిలిచినప్పుడు జరిగిన విషయాన్ని తనీషా ముఖర్జీ గుర్తు చేసుకున్నారు.

అప్పట్లో కెరీర్ పరంగా ఆదిత్య చోప్రా ఇచ్చిన సలహాలను తాను పాటించలేదని, కానీ ఈ ప్రాజెక్ట్ సమయంలో ఆయన మాటలను గుడ్డిగా నమ్ముతానని మాటిచ్చానని తనీషా ముఖర్జీ చెప్పారు. మొదటి ఫోటో షూట్ తర్వాత ఆద...