భారతదేశం, మే 30 -- Tammareddy: టాలీవుడ్ లో సీనియర్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ గురించి తెలియని వాళ్లుండరు. ఎలాంటి సందేహం లేకుండా అనుకున్నది అనుకున్నట్లు ఆయన మాట్లాడతారు. తాజాగా దిగ్గజ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ ను ఉద్దేశించి తమ్మారెడ్డి చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న కొడుకు ఘట్టమనేని జ‌య‌కృష్ణ‌ హీరోగా లాంఛ్ అవుతున్నాడు. అతని డెబ్యూ మూవీ 'శ్రీనివాస మంగాపురం'. ఈ చిత్రానికి అజయ్ భూపతి డైరెక్టర్. ఇందులో రషా తడానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ స్టార్స్ ను పరిచయం చేసేందుకు 'శ్రీను అండ్ మంగ ఇంట్రడక్షన్ ఈవెంట్' ను శనివారం (మే 30) నిర్వహించారు. ఈ మూవీని అశ్వినీ దత్ ప్రజెంట్ చేస్తున్నారు.

శ్రీనివాస మంగాపురం ఈవెంట్ కు రాఘవేంద్ర రావు, తమ్మారెడ్డి భరద్వాజ ...