భారతదేశం, మార్చి 22 -- టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఫ్యాషన్ ప్రపంచంలో మరోసారి తన ముద్ర వేశారు. ముంబైలో జరుగుతున్న లక్మే ఫ్యాషన్ వీక్‌లో ప్రముఖ డిజైనర్ భూమిక శర్మ కోసం ఆమె షో స్టాపర్‌గా వ్యవహరించారు.

'బాహుబలి' వంటి భారీ చిత్రాల నుంచి ఇటీవలి 'స్త్రీ 2', 'జైలర్' చిత్రాల్లోని స్పెషల్ సాంగ్స్ వరకు తన నటనతో, డ్యాన్స్‌తో అలరిస్తున్న తమన్నా.. ఈ వేడుకలో తన ఫ్యాషన్ ఫిలాసఫీని పంచుకున్నారు.

ఫ్యాషన్ అంటే కేవలం ట్రెండ్స్ మాత్రమే కాదని, వ్యక్తిగత సౌకర్యం (Personal Comfort) కూడా ముఖ్యమని తమన్నా స్పష్టం చేశారు. "భూమిక శర్మ రూపొందించిన ఈ దుస్తుల్లో ర్యాంప్‌పై నడవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటివరకు నేను వేసుకున్న డ్రెస్సుల్లో ఇది అత్యంత సౌకర్యవంతమైనది. నేను తరచుగా చెప్పేలా, బట్టలైనా, నగ ల...