భారతదేశం, సెప్టెంబర్ 21 -- Tamannaah Bhatia Bigg Boss Favourite Contestant: రియాలిటీ ఓటీటీ షో బిగ్ బాస్ సీజన్ 20 రోజురోజుకూ ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. ఈ షో ప్రారంభమైన మొదటి రెండు వారాల్లోనే తన విచిత్రమైన ప్రవర్తన, నాటకాలతో కశ్మీరీ సింగర్ ఖాజీ తౌకీర్ ప్రధాన ఆకర్షణగా మారాడు.

హౌస్‌మేట్స్‌ను భయపెట్టడం, ఫేక్ ఎమర్జెన్సీలతో అటెన్షన్ డ్రా చేయడంలో ఖాజీ ఓ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. తాజాగా జరిగిన 'వీకెండ్ కా వారె' ఎపిసోడ్‌లో టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ తమన్నా భాటియా సైతం ఖాజీ హంగామాపై ప్రత్యేకంగా స్పందించారు.

తమ రాబోయే చిత్రం 'ది వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్' ప్రమోషన్‌లో భాగంగా నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు. ఈ సందర్భంగా హోస్ట్ సల్మాన్ ఖాన్‌తో మాట్లాడిన తమన్నా, ప్రస్తుతం సోషల్ మీడియాన...