భారతదేశం, ఫిబ్రవరి 7 -- క్రికెట్ ప్రపంచంలో అసలైన మజా షురూ కాబోతోంది. పొట్టి ఫార్మాట్‌లో విశ్వవిజేత ఎవరో తేల్చే టీ20 ప్రపంచకప్ 2026 సమరానికి నేడు (ఫిబ్రవరి 7) తెరలేవనుంది. భారత్, శ్రీలంక దేశాల్లోని ప్రతిష్టాత్మక స్టేడియాల్లో ఈ నెల రోజుల పాటు బౌండరీల వర్షం కురవనుంది. 2024లో అద్భుత విజయం సాధించిన భారత్ ఈసారి సొంత గడ్డపై ఆ ఆధిపత్యాన్ని కొనసాగించాలని పట్టుదలగా ఉంది.

ఈ మెగా ఈవెంట్ కోసం మొత్తం ఎనిమిది స్టేడియాలను సిద్ధం చేశారు.

భారత్‌లో: అహ్మదాబాద్ (నరేంద్ర మోదీ స్టేడియం), కోల్‌కతా (ఈడెన్ గార్డెన్స్), ఢిల్లీ (అరుణ్ జైట్లీ స్టేడియం), ముంబై (వాంఖెడే స్టేడియం), చెన్నై (చిదంబరం స్టేడియం).

శ్రీలంకలో: కొలంబోలోని ఆర్. ప్రేమదాస మరియు ఎస్.ఎస్.సి (SSC) స్టేడియాలు, కాండీలోని పల్లెకెలె స్టేడియం.

ముఖ్యంగా, మార్చి 8న జరిగే ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరే...