భారతదేశం, మార్చి 1 -- ఇండియన్ ఫ్యాన్స్ కు నిరాశే. టీ20 ప్రపంచకప్ లో మరోసారి చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ఇండియా ఆడాలని, ఆ జట్టును మళ్లీ చిత్తు చేయాలని భారత అభిమానులు ఆశించారు. కానీ పాకిస్థాన్ సెమీస్ చేరకుండానే టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. సూపర్ 8లోనే ఇంటి ముఖం పట్టింది.

టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ ప్రయాణం ముగిసింది. ఆ టీమ్ సూపర్ 8లోనే నిష్క్రమించింది. శనివారం (ఫిబ్రవరి 28) రాత్రి జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో శ్రీలంకపై పాకిస్థాన్ 5 పరుగుల తేడాతో గెలిచింది. కానీ నెట్ రన్ రేట్ లో వెనుకబడి సెమీస్ చేరే అవకాశాన్ని పాకిస్థాన్ దూరం చేసుకుంది. గ్రూప్ 2 నుంచి ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సెమీస్ కు క్వాలిఫై అయ్యాయి.

టీ20 ప్రపంచకప్ సూపర్ 8 గ్రూప్-2లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక ఉన్నాయి. ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ గెలిచిన ఇంగ్లాం...