భారతదేశం, ఫిబ్రవరి 27 -- టీ20 ప్రపంచకప్‌ 2026లో ఫ్యాన్స్ కు ఇండియన్ క్రికెట్ టీమ్ భలే కిక్ ఇచ్చింది. అత్యంత అవసరమైన విజయాన్ని ఖాతాలో వేసుకుంది. గురువారం (ఫిబ్రవరి 26) రాత్రి ముగిసిన మ్యాచ్ లో జింబాబ్వేను 72 రన్స్ తేడాతో భారత్ చిత్తు చేసింది. ఈ గ్రాండ్ విక్టరీతో టీ20 ప్రపంచకప్ లో ఇండియా సెమీఫైనల్ ఛాన్స్ మరింత మెరుగయ్యాయి.

టీ20 ప్రపంచకప్ సూపర్ 8 పోరులో భారత్ అదరగొట్టింది. 72 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. చెన్నైలోని చెపాక్ గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 256/4 భారీ స్కోరు సాధించింది. అభిషేక్ శర్మ 55, హార్దిక్ పాండ్య 50 నాటౌట్, తిలక్ వర్మ 44 రన్స్ తో అదరగొట్టారు. ఛేజింగ్ లో జింబాబ్వే 184/6 స్కోరుకు పరిమితమైంది. అర్ష్ దీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టాడు.

ఇండియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ కంటే ముందు వెస్టిండీస్ ను ద...