భారతదేశం, మార్చి 6 -- ముంబైలోని వాంఖడే స్టేడియం మరో చారిత్రక విజయానికి వేదికైంది. హోరాహోరీగా సాగిన టీ 20 సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఏడు పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్, వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.

ఆదివారం (మార్చి 8) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. అయితే, భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ టీ20 సెమీ ఫైనల్స్ జరిగిన మైదానంలో ఆటగాళ్ల మెరుపుల కంటే గ్యాలరీలో యానిమల్ హీరో రణ్‌బీర్ కపూర్, ఆర్ఆర్ఆర్ బ్యూటీ అలియా భట్ దంపతుల కూతురు రాహా కపూర్ చేసిన సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు రణ్‌బీర్ కపూర్, అలియా భట్, వరుణ్ ధావన్, అనిల్ కపూర్, తృప్తి దిమ్రి వంటి బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. కానీ, కెమెరా కళ్లన్నీ బుజ్జి రాహాపైనే ఉన్నాయ...