భారతదేశం, జూన్ 5 -- Shreyas Iyer news : భారత టీ20 క్రికెట్ జట్టులో ఒక భారీ నాయకత్వ మార్పుు కనిపించబోతోంది! ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను కొత్త సారథిగా నియమించేందుకు భారత సెలక్టర్లు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఒక ప్రముఖ క్రీడా వెబ్‌సైట్ కథనం ప్రకారం.. ఈ మేరకు టీమిండియా మేనేజ్‌మెంట్ తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనితో పాటు ఐపీఎల్‌లో పరుగుల వరద పారించిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి సైతం తొలిసారి జాతీయ జట్టు నుంచి పిలుపు రాబోతోందని సమాచారం.

2028లో జరగబోయే లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్, అలాగే అదే ఏడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికలుగా జరిగే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఈ దీర్ఘకాలిక ప్రణాళికను సిద్ధం చేసింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం శనివారం భారత టీ20 జట...