భారతదేశం, నవంబర్ 7 -- దీపావళి దీపం ఇంట్లో చీకటిని తొలగిస్తే.. డిజిటల్ దీపం విద్యార్థుల భవిష్యత్తుకు వెలుగులు నింపుతుంది. ప్రతి పేదింటి బిడ్డకు నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గద‌ర్శక‌త్వంలో టీ-సాట్ సాంకేతిక‌ పరిజ్ఞానాన్ని తరగతి గదులకు చేరుస్తూ, ఉపాధ్యాయులకు ఆధునిక బోధనా నైపుణ్యాల్లో శిక్షణ కల్పిస్తూ విద్యారంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతోంది. పేద విద్యార్థుల కలలకు సాంకేతిక వెలుగులు అద్దుతూ, వారి భవిష్యత్తును మరింత ఉజ్వలంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

ఏ సమాజ‌మైనా ప్రగతిపథంలో ముందుకు సాగాలంటే దానికి మూలస్తంభం నాణ్యమైన విద్యే. టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ఆధునిక యుగంలో సాంప్రదాయ పాఠ్యపుస్తకాలతో పాటు డిజిటల్ విద్యా వనరులను తరగతి గదికి అనుసంధానించడం కీలకంగా మారింది. పాఠ్...