భారతదేశం, మే 22 -- System review: ఓటీటీలోకి ఈరోజు వచ్చిన ఇంట్రెస్టింగ్ సినిమాల్లో కోర్ట్ రూమ్ డ్రామా అయిన సిస్టమ్ కూడా ఒకటి. జ్యోతిక, సోనాక్షి సిన్హా నటించిన ఈ మూవీ ప్రైమ్ వీడియోలో తెలుగు, హిందీ, తమిళంలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? జ్యోతిక బాలీవుడ్ కమ్‌బ్యాక్ మూవీ మెప్పించిందా లేదా అన్నది ఇక్కడ చూడండి.

సినిమా పేరు: సిస్టమ్ (System)

దర్శకత్వం: అశ్విని అయ్యర్ తివారీ

నటీనటులు: సోనాక్షి సిన్హా, జ్యోతిక, అశుతోష్ గోవారికర్

మ్యూజిక్: కబీర్ కథ్‌పాలియా (OAFF), అనా రెహమాన్, సవేరా

రేటింగ్: ★★★☆☆ (3/5)

ఢిల్లీకి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది రవి రాజ్‌వంశ్ (అశుతోష్ గోవారికర్) కూతురు నేహా రాజ్‌వంశ్ (సోనాక్షి సిన్హా). ఆమె కూడా లాయర్‌గా రాణించాలనుకుంటుంది. అయితే సొంతంగా కేసులు గెలిచి తనను తాను నిరూపించుకుంటే తప్ప తన లా ఫర్మ్‌లో చే...