భారతదేశం, సెప్టెంబర్ 15 -- Sydney Sweeney: అమెరికన్ నటి, రెండుసార్లు ఎమ్మీ నామినేషన్ దక్కించుకున్న సిడ్నీ స్వీనీ తీరు కలకలం రేపుతోంది. స్పోర్ట్స్ ప్రిడిక్షన్ మార్కెట్ ప్లాట్‌ఫామ్ 'నోవిగ్' కోసం చేసిన ఆమె చేసిన ఓ న్యూడ్ యాడ్ నెట్టింట సంచలనంగా మారింది. అందులో ఆమె క్రీడా పరికరాలతో మాత్రమే తన శరీరాన్ని కవర్ చేసుకోవడం తీవ్రమైన విమర్శలకు దారితీసింది.

సిడ్నీ స్వీనీ నగ్న యాడ్ పై 4 సార్లు ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ స్విమ్మర్ టిట్మస్ ఫైర్ అయింది. "ఇది చూసినప్పుడు నాకెంత కోపం కలిగిందో మాటల్లో చెప్పలేను. మహిళల శరీరాన్ని వ్యాపార వస్తువుగా మార్చడం, మహిళా క్రీడలను సెక్సువలైజ్ చేయడం ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది?" అని ఇన్‌స్టాగ్రామ్‌లో టిట్మస్ ప్రశ్నించారు.

బుడాపెస్ట్‌లో జరిగిన అల్టిమేట్ ఛాంపియన్‌షిప్ పోటీల అనంతరం బీబీసీ ఇంటర్వ్యూలో బ్రిటీష్ స్ప్రింటర్ అమీ హ...