భారతదేశం, అక్టోబర్ 23 -- హైదరాబాద్, విశాఖపట్నం సహా దేశవ్యాప్తంగా ప్రజలు ఎక్కవగా వాడే ప్రముఖ ఫుడ్ అండ్ క్విక్ కామర్స్ యాప్ 'స్విగ్గీ' స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను ముంచెసింది! ఒక్క శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌లోనే స్విగ్గీ షేరు ధర ఏకంగా 17 శాతానికి పైగా పడిపోయి, లిస్టింగ్ అయిన తర్వాత అత్యంత దారుణమైన (ఒకరోజు) పతనాన్ని నమోదు చేసింది. సెప్టెంబర్ 2026 (క్యూ2) త్రైమాసికానికి సంబంధించి కంపెనీ వెల్లడించిన ఫలితాలు నిరాశపరచడంతో పలు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు కంపెనీ టార్గెట్ ప్రైజ్​ని తగ్గించాయి. దీనితో ఒక్క రోజులోనే మార్కెట్లో స్విగ్గీ ఇన్వెస్టర్ల సంపద రూ.10,000 కోట్లు తుడిచిపెట్టుకుపోయింది!

శుక్రవారం నాటి ట్రేడింగ్ ఓపెనింగ్​లో స్విగ్గీ షేరు ధర 17.22 శాతం క్షీణించి రూ.174.90 వద్ద 52 వారాల కనిష్ఠ స్థాయికి చేరింది. దీనితో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ...