భారతదేశం, ఏప్రిల్ 27 -- సాధారణంగా మనం నిద్రపోయినప్పుడు ఎన్నో కలలు వస్తూ ఉంటాయి. కలలకు అనేక అర్థాలు కూడా ఉంటాయి. మనకు వచ్చే కలలను బట్టి అది శుభ ఫలితాలను తీసుకు వస్తుందా, అశుభ ఫలితాలను తీసుకు వస్తుందా అనేది తెలుసుకోవచ్చు. చాలా మందికి నిద్రపోయినప్పుడు కలలో డబ్బు కనపడుతూ ఉంటుంది. అది శుభ ఫలితాలను అందిస్తుందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

స్వప్న శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, కలలో మీరు పదే పదే రూపాయి కాసులు, కాయిన్స్ వంటివి చూసినట్లయితే అది చాలా శుభప్రదమైన కల అని భావించాలి. ఇలాంటి కలలు వచ్చినట్లయితే ఆర్థిక నష్టం నుంచి త్వరలోనే బయటపడతారని అర్థం. ఇలాంటి కలలు వచ్చినప్పుడు తర్వాత రోజు కొంత డబ్బు ఎవరికైనా దానం చేయడం మంచిది. అలా చేయడం వలన నష్టాలు సంభవించకుండా ఉంటాయని పండితులు చెబుతున్నారు.

కలలో దొంగలించిన డబ్బు చూడడం మంచిదా కాదా అనే విషయానికి వ...