భారతదేశం, మార్చి 29 -- ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్‌గా నటించిన సినిమా సుయోధన. డైలాగ్ కింగ్ సాయి కుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మించారు.

సుయోధన సినిమా శుక్రవారం (ఈ నెల 27న) ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. సుయోధన సక్సెస్ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ బోసుబాబు నిడుమోలు, డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు, డైరెక్టర్ వైఎస్ మాధవ్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

నిర్మాత బోసుబాబు నిడుమోలు మాట్లాడుతూ.. "సుయోధన చిత్రంతో మొదటి ప్రయత్నంలోనే మా చిత్రానికి మంచి విజయాన్ని అందించారు. మా నెక్ట్స్ మూవీకి ఇంతకంటే పెద్...