భారతదేశం, మార్చి 18 -- 2026లో కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగం యుద్ధభూమిని తలపిస్తోంది. ఒకప్పుడు ఈ సెగ్మెంట్‌లో రారాజుగా వెలిగిన రెనాల్ట్ డస్టర్ సరికొత్త అవతారంలో మళ్లీ రంగంలోకి దిగింది. ఇప్పటికే మార్కెట్​ను ఏలుతున్న హ్యుందాయ్ క్రెటా, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారాలకు చెక్ పెట్టేలా తన వ్యూహాలను సిద్ధం చేసుకుంది. మరి ఈ మూడు ఎస్​యూవీల్లో దేని ధర తక్కువ? దేనికి మంచి పెర్ఫార్మెన్స్​ ఉంది? ఇక్కడ తెలుసుకోండి..

కొత్త డస్టర్ ప్రధానంగా టర్బో-పెట్రోల్ ఇంజన్లపై దృష్టి సారించింది.

Turbo TCe 100: ఇది 1.0 లీటర్ టర్బో ఇంజన్‌తో వస్తుంది (99 బీహెచ్​పీ, 160 ఎన్​ఎం). కేవలం 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

Turbo TCe 160: ఇది శక్తివంతమైన 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ (163 బీహెచ్​పీ, 280 ఎన్​ఎం). ఇందులో మాన్యువల్, డీసీటీ ఆటోమేటిక్ ఆప్షన్లు ఉన్నాయి. ఎకో...