భారతదేశం, ఆగస్టు 11 -- Suriya Jyotika: తమిళ స్టార్ హీరో సూర్య, ఆయన భార్య జ్యోతిక చెన్నైలోని తమ విలాసవంతమైన బంగ్లాను వదిలేసి ముంబైలోని ఓ చిన్న ఫ్లాట్‌కి ఎందుకు మారారో రివీల్ చేశారు. త్వరలోనే 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సూర్య.. ప్రమోషన్ల క్రమంలో స్టార్ యాంకర్ సుమ ఇంటర్వ్యూలో తమ ముంబై లైఫ్‌స్టైల్ గురించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

కరోనా మహమ్మారి తర్వాత పిల్లలు దివ్య, దేవ్‌లతో కలిసి ఈ జంట ముంబైకి షిఫ్ట్ అయింది. అక్కడ చాలా సాధారణమైన, ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు సూర్య స్పష్టం చేశారు.

చెన్నైలో పెద్ద రాజభవనం లాంటి ఇంట్లో ఉన్న సూర్య-జ్యోతిక దంపతులు.. ముంబైలో కేవలం 1700 చదరపు అడుగుల చిన్న ఫ్లాట్‌లో ఉంటున్నట్లు చెప్పారు. "ముంబై నాకొక వెకేషన్ లాంటిది. అక్కడ మేం ఉండేది చాలా చిన్న ఇల్లు. రెండు అడుగులు వ...