భారతదేశం, మార్చి 11 -- భారత న్యాయ చరిత్రలో బుధవారం ఒక అరుదైన, అత్యంత కీలకమైన తీర్పు వెలువడింది! గత 11 ఏళ్లుగా అపస్మారక స్థితిలో (పర్మనెంట్​ వెజిటేటివ్​ స్టేట్​) మంచానికే పరిమితమైన 31 ఏళ్ల వ్యక్తికి 'కారుణ్య మరణం' (పాసివ్​ యుథనేషియా) ఇచ్చేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. భవిష్యత్తులో ఇటువంటి కేసులను నియంత్రించేందుకు అవసరమైన రక్షణ చర్యలు, విధానపరమైన మార్గదర్శకాలను కూడా ఈ సందర్భంగా ధర్మాసనం ఖరారు చేసింది.

జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరిస్తూ.. సదరు రోగి ప్రయోజనాలను, అతడి గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని, పాలియేటివ్ కేర్ పర్యవేక్షణలో అతడికి అందుతున్న జీవన రక్షణ సాయాన్ని ఉపసంహరించుకోవడమే సరైన నిర్ణయమని పేర్కొంది.

హరీష్ రాణా తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతించిన సుప్రీంకోర్టు.. కఠ...