భారతదేశం, నవంబర్ 3 -- విమాన ప్రయాణం ఖరీదైపోతోంది.. టికెట్ల ధరలు ఏకంగా 700 శాతం పెరిగాయి, తక్షణమే జోక్యం చేసుకోండి అంటూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఒక పిటిషనర్‌కు ఊహించని షాక్ ఎదురైంది. "టికెట్ల ధరలు అంతగా పెరిగితే విమానాల్లో ప్రయాణించడం మానేయండి" అని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

విమాన ఛార్జీల అనియంత్రిత పెంపుపై దాఖలైన అత్యవసర పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా విమాన ప్రయాణికుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్​లతో కూడిన ధర్మాసనం ఎదుట ఒక న్యాయవాది ఈ విషయాన్ని ప్రస్తావించారు. దేశంలో విమాన టికెట్ల ధరలు 700 శాతం వరకు పెరిగాయని, దీనిపై అత్యవసరంగా విచారణ జరిపి ధరలను అదుపు చేసేలా ఆదేశాలు ఇవ్వాల...