భారతదేశం, జూన్ 23 -- Super Subbu Trailer: టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ లీడ్ రోల్లో నటిస్తున్న నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు. కొన్నాళ్లుగా ఎంతో ఆసక్తి రేపుతున్న ఈ సిరీస్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారు. సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్ గా సందీప్ నటిస్తున్న ఈ సిరీస్ ట్రైలర్ రేపు రిలీజ్ చేయబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.

నెట్‌ఫ్లిక్స్ తెరకెక్కించిన తొలి తెలుగు వెబ్ సిరీస్ గా ఈ సూపర్ సుబ్బు ప్రత్యేకత సంపాదించుకుంది. ఈ సిరీస్ ను జులై 2 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది.

ఇక బుధవారం (జూన్ 24) ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. "ఎంతో అసౌకర్యానికి గురి చేసే సంభాషణే సుబ్బు ఫుల్ టైమ్ జాబ్ లాగా మారిపోయింది" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేస్తూ.. ట్రైలర్ న...