భారతదేశం, జూన్ 15 -- Super Subbu OTT: పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ రూట్ మార్చింది. తెలుగు ఆడియన్స్ ను టార్గెట్ చేసిన ఈ ఓటీటీ ఓ కామెడీ వెబ్ సిరీస్ ను తీసుకొస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మొదటి ఒరిజినల్ తెలుగు వెబ్ సిరీస్ 'సూపర్ సుబ్బు' స్ట్రీమింగ్ తేదీ ఖరారైంది. ఇవాళ ఈ సిరీస్ స్ట్రీమిండ్ డేట్ ను నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.

గ్లోబల్ ఓటీటీ జెయింట్ నెట్‌ఫ్లిక్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మొట్టమొదటి పూర్తి స్థాయి తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్ 'సూపర్ సుబ్బు' జులై 2 నుంచి డిజిటల్ స్క్రీన్స్‌పైకి రాబోతోంది. సందీప్ కిషన్, మిథిలా పాల్కర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ స్ట్రీమింగ్ డేట్ ను ఇవాళ (జూన్ 15) ప్రకటించారు.

సాధారణంగా నెట్‌ఫ్లిక్స్ అంటే 'రానా నాయుడు' లేదా 'సేక్రెడ్ గేమ్స్' లాంట...