భారతదేశం, నవంబర్ 13 -- Super Hero OTT: 2019లో వచ్చిన 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. థానోస్ చేసిన విధ్వంసం తర్వాత మిగిలిన సూపర్ హీరోలంతా ఒక్కటై చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ గూస్ బంప్స్ తెప్పించింది. ఆ అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌ను మళ్లీ ఫ్యాన్స్‌కు అందించేందుకు మార్వెల్ స్టూడియోస్ సిద్ధమైంది.

రీసెంట్ గా థియేటర్లలో రీ-రిలీజ్ అయి సక్సెస్ సాధించిన ఈ ఎండ్‌గేమ్: ఎన్‌కోర్ సినిమా.. ఇప్పుడు నేరుగా ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చేస్తోంది. ఇది కేవలం మనం గతంలో చూసిన పాత సినిమా మాత్రమే కాదు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU)లో రాబోయే భారీ మార్పులకు ఇది పునాది అని చెప్పొచ్చు.

'అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎన్‌కోర్' పేరుతో వచ్చిన ఈ ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌లో కొన్ని కొత్త పోస్ట్-క్రెడిట్ సీన్స్ యాడ్ చేశారు. రాబోయే బ్లాక్ బస...