భారతదేశం, మార్చి 3 -- బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ తన తాజా యూట్యూబ్ వ్లాగ్ కోసం నటి సన్నీ లియోన్ ముంబై నివాసానికి వెళ్లారు. అక్కడ జరిగిన చిట్ చాట్‌లో సన్నీ లియోన్ తన కుమార్తె నిషా గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని పంచుకున్నారు.

నిషా కౌర్ వెబర్ (Nisha Kaur Weber) కేవలం 10 ఏళ్ల వయసులోనే ఒక కొత్త వస్తువును కనిపెట్టడమే కాకుండా, దానికి అధికారికంగా పేటెంట్ హక్కులు కూడా పొందిందని బాలీవుడ్ స్టార్ సన్నీ లియోన్ గర్వంగా వెల్లడించారు.

నిషా కనిపెట్టిన ఈ వస్తువు పేరు 'బూ బాక్స్' (Boo box). ఇది ఒక టూ-ఇన్-వన్ టిష్యూ హోల్డర్. సాధారణ టిష్యూ బాక్స్‌లకు భిన్నంగా దీనికి ఒక చిన్న చెత్త బుట్ట (Mini trash bin) కూడా కలిపి ఉంటుంది. అంటే టిష్యూ వాడుకున్న వెంటనే, పక్కనే ఉన్న బిన్‌లో వేసేయవచ్చు. దీనివల్ల ఇల్లంతా టిష్యూలు పడకుండా చాలా శుభ్రంగా ఉంటుంది...