భారతదేశం, జూన్ 20 -- Sunkari Narahari Rao ACB Case : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ (మల్టీ జోన్-2) డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి రావుకు సంబంధించిన అక్రమ సంపాదన ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఈ దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ శాలిబండలోని కెనరా బ్యాంక్ శాఖలో ఉన్న నరహరి రావు వ్యక్తిగత లాకర్‌ను ఏసీబీ అధికారులు శనివారం తెరిచారు. ఈ సోదాల్లో లాకర్‌లో గుట్టలుగా దాచిన రూ.1.50 కోట్ల నగదును చూసి అధికారులు సైతం విస్మయానికి గురయ్యారు. ఆ డబ్బు మొత్తాన్ని స్వాధీనం చేసుకుని లెక్కింపు పూర్తి చేశారు.

సుంకరి నరహరి రావుపై వచ్చిన అవినీతి ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ అధికారులు గత కొన్ని రోజులుగా నిఘా పెట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో ఆయన ఇళ్లు, కార్యాలయాలపై ఇటీవలే ఏసీబీ దాడులు నిర్వహించి...