భారతదేశం, మే 14 -- Suniel Narang: ఏషియన్ మల్టీప్లెక్స్ అధినేత సునీల్ నారంగ్ కామెంట్లు కలకలం రేపుతున్నాయి. ప్రొడ్యూసర్ నాగవంశీకి కౌంటర్ ఇస్తూ సునీల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. బాల్డ్ హెడ్, డూప్లికేట్ విగ్ అంటూ సునీల్ మాట్లాడటం సంచలనంగా మారింది. దీంతో ప్రొడ్యూసర్స్ వర్సెస్ ఎగ్జిబ్యూటర్ల వివాదం మరింత ముదిరినట్లు కనిపిస్తోంది.

తాజాగా టీవీ9 న్యూస్ ఛానెల్ తో మాట్లాడుతూ సునీల్ నారంగ్ చేసిన కామెంట్లు సెన్సేషనల్ గా మారాయి. నాగవంశీ గురించి మాట్లాడుతూ సునీల్ కొత్త వివాదానికి తెరతీసినట్లే కనిపించారు.

''ఆ ప్రొడ్యూసర్ ఉంటాడు కదా. బేటా క్యా నామ్ హై. ప్రొడ్యూసర్ కళ్లద్దాలు పెట్టుకుంటాడు. బాల్డ్ హెడ్. డూప్లికేట్ విగ్ పెట్టుకుంటాడు. నాగవంశీ.. పాము.. హా సారీ నాగవంశీ. నాకు మల్టీప్లెక్స్ లు ఉన్నాయని ఆయన ఏదో అన్నాడు. ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ...