భారతదేశం, ఏప్రిల్ 20 -- Sukanya Samriddhi Yojana: మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్ల పుట్టగానే వారి చదువు, పెళ్లి ఖర్చుల కోసం పొదుపు చేయడం మన సంప్రదాయం. ఇందుకు ప్రభుత్వ మద్దతు ఉన్న సుకన్య సమృద్ధి యోజన (SSY) అత్యంత లాభదాయకమైన మార్గం. ప్రస్తుతం ఈ పథకంపై ప్రభుత్వం 8.2% వడ్డీని అందిస్తోంది. ఇది ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాల కంటే చాలా ఎక్కువ. అయితే, ఈ పథకంలో ప్రధానంగా వినిపించే ప్రశ్న.. "డబ్బులు అత్యవసరమైతే 21 ఏళ్లు ఆగాల్సిందేనా?". దీనికి నిబంధనలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం.

మీ అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాత ఆమె ఉన్నత చదువుల (Higher Education) కోసం ఖాతాలోని నిల్వలో 50 శాతం వరకు నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు.

సాధారణంగా ఈ ఖాతా 21 ఏళ్ల తర్వాతే మెచ్యూరిటీకి వస్తుంది. కానీ, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఖాతాను పూర్తిగా క్లోజ్ చేసి వడ్డీతో సహా మ...