భారతదేశం, సెప్టెంబర్ 18 -- Suhas Mandaadi Director: తమిళ మూవీ 'మండాడి' (Mandaadi) సక్సెస్ మీట్‌లో డైరెక్టర్ మతి మారన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెలుగు నటుడు సుహాస్ స్వరాష్ట్రంలో అతని శరీర రంగు పరంగా బాడీ షేమింగ్, కలర్ కామెంట్స్ ఎదుర్కొన్నాడని, కోలీవుడ్ మాత్రమే అతన్ని గుండెలకు హత్తుకుందని డైరెక్టర్ కామెంట్స్ చేయడంపై తెలుగు ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సూరి ప్రధాన పాత్రలో, సుహాస్ కీలక పాత్రలో నటించిన తమిళ స్పోర్ట్స్ డ్రామా 'మండాడి' బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా విజయోత్సవ సభలో మాట్లాడిన దర్శకుడు మతి మారన్.. సుహాస్ తన రంగు, సొంత రాష్ట్రంలో వచ్చిన కామెంట్స్ చూసి షూటింగ్ టైమ్‌లో చాలా బాధపడేవాడని చెప్పుకొచ్చారు.

"సుహాస్ తన శరీర రంగుపై వచ్చిన కామెంట్స్ కు బాధపడ్డాడు. కానీ తమిళనాడు...