Subhash Chandra loan : అప్పు రూ. 22,000 కోట్లు.. కట్టాల్సింది రూ. 6.5 కోట్లే! సుభాష్ చంద్ర కేసుపై రచ్చ
భారతదేశం, ఆగస్టు 28 -- భారతీయ కార్పొరేట్ దివాలా చరిత్రలోనే అత్యంత విస్మయపరిచే తీర్పు వెలువడింది. జీ మీడియా గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) భారీ ఉపశమనం అందించింది. వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆయన చెల్లించాల్సిన రూ.22,006.57 కోట్ల రుణాలకు గాను కేవలం రూ.6.5 కోట్లు చెల్లిస్తే సరిపోతుందంటూ సమర్పించిన పరిష్కార ప్రణాళికకు ఎన్సీఎల్టీ ఆమోదముద్ర వేసింది. అంటే రుణదాతలు ఏకంగా 99.97 శాతం మేర తమ బాకీలను వదులుకోవాల్సి వస్తోంది.
సామాన్యుడు చిన్న గృహ రుణం ఎగవేస్తే ఆస్తులను జప్తు చేసే బ్యాంకింగ్ వ్యవస్థ, వేల కోట్ల ఎగవేతపై ఇంత పెద్ద మొత్తంలో మినహాయింపు ఇవ్వడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఎన్సీఎల్టీ (మూడో) సభ్యుడు నిలేష్ శర్మ నేతృత్వంలోని ధర్మాసనం ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ (ఐబీసీ) ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.