భారతదేశం, జూలై 5 -- ఉన్నత చదువులు, పార్ట్ టైమ్ ఉద్యోగాలు, సులువుగా పీఆర్ (శాశ్వత నివాసం) వచ్చే అవకాశం.. ఇవే గత కొన్నేళ్లుగా భారతీయ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కెనడా వైపు పరుగులు పెట్టించాయి. అయితే 2026 నాటికి ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది! ఈ మేరకు ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (ఐఆర్​సీసీ)తో పాటు స్టాటిస్టిక్స్ కెనడా విడుదల చేసిన తాజా గణాంకాలు నివ్వెరపరుస్తున్నాయి. గతంతో పోలిస్తే విదేశీ విద్యార్థుల రాక ఏకంగా 64 శాతం మేర క్షీణించింది. నిబంధనలు కఠినతరం కావడం, ఖర్చులు భారంగా మారడంతో భారత్​తో పాటు ఇతర దేశాల విద్యార్థులు ఇప్పుడు కెనడాకు ప్రత్యామ్నాయంగా ఇతర దేశాల వైపు మొగ్గు చూపుతున్నారు.

అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గడానికి కెనడా ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలే ప్రధాన కారణం. దేశంలోకి వచ్చే విదేశీ...