భారతదేశం, ఆగస్టు 7 -- గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 374 పాయింట్లు పెరిగి 78,955 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 11 పాయింట్లు వృద్ధిచెంది 24,636 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 324 పాయింట్లు పెరిగి 58,064 వద్దకు చేరింది.

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 17.86 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,013.60 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 5 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50కి 24,400- 24,450 లెవల్స్​ కీలక సపోర్ట్​గా, 24,750- 24,800 లెవల్స్​ కీలక రెసిస్టెన్స్​గానూ ఉన్నాయి. రెసిస్టెన్స్ బ్రేక్ అయితే...