భారతదేశం, జూన్ 16 -- సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 737 పాయింట్లు పెరిగి 76,264 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 231 పాయింట్లు వృద్ధిచెంది 23,854 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 384 పాయింట్లు పెరిగి 57,199 వద్దకు చేరింది.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 200 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,189.26 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 5 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

"బలమైన గ్యాప్​ అప్​ ఓపెనింగ్ తర్వాత నిఫ్టీ50.. డైలీ ఛార్ట్​లో చిన్న రెడ్​ క్యాండిల్​ని ఫార్మ్ చేసింది. ఈ గ్యాప్​ని బుల్లిష్​ బ్రేకవే గ్యాప్ అంటార...