భారతదేశం, మార్చి 18 -- మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 568 పాయింట్లు పెరిగి 76,071 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 172 పాయింట్లు వృద్ధిచెంది 23,581 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 463 పాయింట్లు పెరిగి 54,876 వద్దకు చేరింది.

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 4,741.22 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,225.32 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 25 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50కి 23,350- 23,300 కీలక సపోర్ట్​ జోన్​గా ఉంది. పుల్​ బ్యాక్​ అయితే సూచీ 23,800కి, అక్కడి నుంచి 23,950 వరకు వెళ్లొచ్చు," అని ...